ఏపీలో మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార పార్టీ వైసీపీలో చేర్పులు మార్పులతో చాలామంది నేతలు సైడ్ అవుతున్నారు.
తమకు టికెట్ కేటాయించలేదని తెలిసిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా టికెట్ కేటాయించిన వారు కూడా అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానికి, వైఎస్ జగన్కు నేతల రాజీనామాలు తలనొప్పులు తెస్తున్నాయి.