నరసరావుపేట లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. టికెట్ దక్కే అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారాయన.
అయితే నరసరావుపేట లోక్సభ నుంచి బీసీ అభ్యర్థికి వైసీపీ టికెట్ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. దీనికోసం రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కాగా మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు అని సమాచారం.