మాఘ మాస ప్రారంభ ముందురోజును 'మౌని అమావాస్య' అంటారు. శుక్రవారం పితృదేవతలు, పూర్వీకులకు పిండ ప్రదానాలు, పితృదోష నివారణ పూజలు చేస్తారు. రాబోయే వేసవి నేపథ్యంలో సూర్యుడిని ఆరాధిస్తూ నదుల్లో పుణ్య స్నానాలు చేస్తారు. అటు కొందరు శివుడిని, విష్ణువును ఆరాధిస్తూ 'మౌన వ్రతం' చేస్తారు. ఈ రోజు గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు వంటి శుభాకార్యాలు చేయరు. గతించిన వారిని స్తుతిస్తూ, మానసికంగా ప్రశాంతంగా ఉండాలనేది దీని ఉద్దేశం.