ఇటీవల చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు కొన్ని రకాల పదార్థాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినకూడదని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వాటికి దూరంగా ఉండాలట. మద్యం ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉండదని, సిగరెట్ వంటి వాటిని తాగడం వల్ల రక్తపోటు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.