విజయవాడలో వ్యాపారుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డికి రూ.65 లక్షల విలువైన బంగారు వస్తువులు ఇచ్చారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్ ఆరోపించారు.
ఇది వాస్తవమో కాదో? చెప్పాలని ఆయన డిమాండు చేశారు. 'వ్యాపారసంస్థల మీద దాడులు చేసే అధికారుల వాహనాలకు నంబరు ప్లేట్లు, పోలీసులకు నేమ్ బ్యాడ్జీలు ఉండవు' అని రాకేశ్ ధ్వజమెత్తారు.