గాజాలో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ‘UNWRA’ హెడ్‌క్వార్టర్స్ భవనాల కింద ఉన్న భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించింది.
దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేసింది. తమ కార్యకలాపాల కోసం హమాస్ ఈ సొరంగం నిర్మించి దీనికి విద్యుత్ సదుపాయం ఏర్పాట్లు చేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.