ఫిబ్రవరి 28నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష కొనసాగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జిల్లాల్లో కలిపి 544 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు, తాగునీరు FIRST AID ఉంచుతున్నారు. సమయానికి ముందుగా కేంద్రానికి చేరుకోవాలని విద్యార్ధులకు సూచనలు చేశారు.