మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. దీని సంరక్షణ కూడా ముఖ్యం. కానీ చర్మ సంరక్షణ విషయంలో చాలా అపోహలుంటాయి. అయితే చాలా మంది నూనె వస్తువులు తింటే మొటిమలు వస్తాయని అనుకుంటారు. అయితే చర్మం నుంచి విడుదలయ్యే నూనె లాంటి సీబమ్ వల్ల యాక్నె (మొటిమలు) వస్తుంది. ఆయిలీ ఫుడ్ తింటే యాక్నె వస్తుందనటానికి ఎలాంటి రుజువు లేదని నిపుణులు చెబుతున్నారు.