వేసవి కాలంలో పుచ్చకాయలను ఎక్కువగా తింటుంటారు. ఇది వేసవిలో ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అయితే, పుచ్చకాయను చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటుంటారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండు. వేడి, తేమతో కూడిన వాతావరణంలో హైడ్రేషన్ మూలంగా ఉపయోగపడుతుంది. కానీ ఈ పండును ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తినకూడదు. ఖాళీ కడుపుతో పుచ్చకాయను తీసుకోవడం వలన శరీర రకం, హర్మోన్ల పనితీరు ఆధారంగా ప్రయోజనం చేకూర్చవచ్చు లేదా ప్రయోజనం పొందకపోవచ్చు.