వేసవి కాలంలో వేడి తాపం నుండి ఉపశమనం పొందేందుకు నానా అవస్థలు పడుతుంటారు. శరీర వేడిని తగ్గించుకునేందుకు శీతల పానీయాలు, పండ్లు వంటివి తీసుకుంటాము. ముఖ్యంగా శరీర వేడిని తగ్గించుకునేందుకు రోజులో పదే పదే స్నానం చేస్తూ ఉంటాము. వేసవి కాలంలో వేడి గాలుల బారి నుంచి బయటపడేందుకు తరచుగా స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచిస్తున్నారు.