ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనిపిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం విజయవాడలో టీడీపీ అభ్యర్థులతో భేటీ అయి మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని, ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు, టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.