మగవారు అశ్వగంధను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యపరంగా, మానసికంగా ఎంతో మంచి జరుగుతుందని వైద్యులు వివరించారు. అశ్వగంధ చూర్ణాన్ని వాడటం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. రక్తంలో చక్కెర, కొవ్వు కంట్రోల్ ఉండటం, కండరాల పెరుగుదల, గుండె ఆరోగ్యంగా ఉండటం, టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడం, జ్ఞాపకశక్తి పెరగడం.. లాంటి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.