కాకరకాయతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పేగుల్లో చేరిన మలినాలతో పాటు మూత్రపిండాల్లో ఉన్న ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలు తొలగుతాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. క్యాన్సర్, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.