పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి యూఏఈలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. అందులో జమైన నగదును క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.