భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బంగారు ఆభరణాలు మహిళల అందాన్ని పెంచుతాయని చెప్పొచ్చు. ఇదే క్రమంలో బంగారానికి డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల గోల్డ్ రేటు భారీగా ఎగబాకుతోంది. ముందుగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో బంగారం రేటు పెరుగుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి బంగారం ధర పెరుగుతుంటుంది. ఇంకా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా.. ఇది కూడా బంగారం రేట్ల పెంపునకు కారణం అవుతోంది.
గోల్డ్ రేట్లు అంతటా ఒకేలా ఉండవు. ఇది ప్రాంతాల్ని బట్టి మారుతుంది. వేర్వేరు పన్నులు, షిప్పింగ్ కాస్ట్స్, ప్యూరిటీ స్టాండర్డ్స్, లోకల్ డిమాండ్, సప్లైని బట్టి రేట్లు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ఇంకా వేర్వేరు రాష్ట్రాలు గోల్డ్‌పై వాల్యూ యాడెడ్ టాక్స్ విధిస్తుంటాయి. జీఎస్టీ ఉంటుంది. ట్రాన్స్‌పొర్టేషన్, రీజనల్ సప్లై, డిమాండ్, హాల్‌మార్కింగ్, ఛార్జింగ్ ఇవన్నీ బంగారం ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇక బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని వాడుతుంటారు. 24 క్యారెట్ల గోల్డ్.. జువెలరీ తయారు చేసేందుకు అనువుగా ఉండదు. చాలా తక్కువగా దీనిని వినియోగిస్తుంటారు. 22 క్యారెట్స్ గోల్డ్‌లో 91.6 శాతం బంగారం ఉంటుంది. 22 క్యారెట్లతో పాటు 14 క్యారెట్లు, 18 క్యారెట్లలో కూడా బంగారు ఆభరణాలు అందుబాటులో ఉంటాయి.
ఇక ప్రముఖ గోల్డ్ జువెలరీల్లో బంగారం ధర గ్రాముకు ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తనిష్క్ గోల్డ్ జువెలరీలో బంగారం ధర గ్రాముకు రూ. 7004 గా ఉంది. మలబార్ గోల్డ్‌లో పసిడి రేటు గ్రాముకు రూ. 6805 గా ఉంది. జోయాలుక్కాస్‌లో రూ. 6805 గా ఉంది. కల్యాణ్ జువెల్లర్స్‌లో పసిడి ధర గ్రాముకు రూ. 6815 పలుకుతోంది. దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ. 68,060 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాములకు ఇప్పుడు రూ. 74,250 వద్ద ఉంది.