ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిక్షావాలా నుంచి కోటీశ్వరుడిగా.. బిహార్ స్టార్టప్ కింగ్ 'దిల్‌ఖుష్' ప్రస్థానం

business |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:13 PM

బిహార్‌లోని పట్నా విమానాశ్రయం నుంచి తన స్వగ్రామం వెళ్లేలనుకున్న ఓ టెకీ.. రాత్రి రెండు గంటల సమయంలో రోడ్‌బెజ్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కానీ, చాలా సేపటి వరకు క్యాబ్ రాలేదు. దీంతో ఆ సంస్థ సీఈఓకు తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ మెయిల్ చేశాడు. ఆ వెంటనే ఐదు నిమిషాల్లోనే మరో క్యాబ్ వచ్చింది. ఆ డ్రైవర్ సీట్లో ఉన్నది స్వయంగా రోడ్‌బేజ్ సంస్థ వ్యవస్థాపకుడు దిల్‌ఖుష్ కుమార్. బిహార్ స్టార్టప్ కింగ్ ఇలా డ్రైవర్ గా రావడంపై టెకీ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇప్పుడు దిల్‌ఖుష్ కుమార్ గురించి మళ్లీ ప్రజలు చర్చించుకుంటున్నారు.


బిహార్‌లోని సహస్ర జిల్లాలోని బనగావ్ అనే మారుమూల గ్రామానికి చెందిన పవన్ ఖాన్ ప్రైవేట్ బస్ డ్రైవర్‌గా ఉండేవాడు. అతని కుమారుడే దిల్‌ఖుష్ కుమార్. తన కొడుకిని పెద్ద చదువులు చదివించాలనుకున్నా విధి వెక్కింరించింది. రోడ్డు ప్రమాదంతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఇంటి బాధ్యతలను దిల్‌ఖుష్ తన భుజాలకెత్తుకోవాల్సి వచ్చింది. ఇంటర్ చదువు మానేసి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. దీంతో ఓ స్కూల్‌లో క్లర్క్ పని కోసం ప్రయత్నించాడు. అప్పుడు యాపిల్ లోగోని చూపించి ఇది ఏ ఫోన్ ది అని అడిగారటా. తనకు తెలియదని చెప్పడంతో నువ్వో పల్లెటూరి మొద్దువి నీకేందుకీ ఉద్యోగాలు అంటు హేళన చేశారటా. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌గా చేసేందుకు ఢిల్లీ వెళ్లిన అతనికి.. అక్కడా అవమానాలే ఎదురయ్యాయటా.


ట్రాఫిక్ రూల్స్ తెలయవని, రూట్లూ అర్థం కావని ఏ క్యాబ్ సంస్థ అవకాశం ఇవ్వలేదట. దీంతో చేసేదేమీ లేక రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు దిల్‌ఖుష్ కుమార్. రెండు నెలల తర్వాత అక్కడి వాతావరణం పడక అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సొంతూరికి తిరిగి రావాల్సి వచ్చింది. అందరూ చేతగాడివి అంటూ హేళన చేయడం మొదలు పెట్టడంతో ఓ వ్యాపారి వద్ద కారు డ్రైవర్ గా చేరానని, ఆ ఆదాయమూ సరిపోక పోవడంతో సాయంత్రం పూట కూరగాయలు అమ్మేవాడినని పలు సందర్భాల్లో చెప్పాడు దిల్‌కుష్ కుమార్. స్వయం ఉపాధి తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని, ఇకపై ఏ పని చేసినా సొంతంగా ఉండాలనుకున్నాని తెలిపాడు. అదే సమయంలో పట్నాలో ఓలా, ఉబర్ సంస్థలు వచ్చాయి. అలాంటి క్యాబ్ సేవలు పల్లె ప్రాంతాలకూ అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన దిల్‌ఖుష్ కి వచ్చింది. ఆ వెంటనే సెకండ్ హ్యాండ్ నోనో కారు కొని జిల్లాలోనే సేవలు ప్రారంభించాడు. ఆ సంస్థకు ఆర్యగో అని పేరు పెట్టాడు. తన పశువుల కొట్టాన్ని ఆఫీసుగా మార్చుకున్నాడటా.


పల్లెలో క్యాబ్ సేవలంటేని అందరూ నవ్వినవారే. కానీ ఫోన్ చేయగానే ఇంటి ముందు వాలిపోయే క్యాబ్ సౌకర్యాన్ని మెల్లగా అర్థం చేసుకున్నారు. దీంతో డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత ఆరు లక్షలు అప్పు చేసి మరో రెండు శాంత్రో కార్లు కొని సేవలను విస్తరించాడు. పట్నా, దర్భంగా వంటి నగరాల నుంచి గ్రామాలకు వెళ్లేవారి సంఖ్య పెరగడం గమనించిన దిల్ ఖుష్.. దానిని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు. 150 కిలోమీటర్లకు రూ.4,500 తీసుకుంటారు. అలా కాకుండా ప్రయాణికులకు ఒకవైపు ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకు తిరుగు ప్రయాణంలో మళ్లీ కస్టమర్లు ఉండేలా చూసుకోవాలని ప్రణాళిక రచించాడు. అలాగే కార్ పూలింగ్ పద్ధతిని తీసుకొస్తే ఖర్చు మరింత తగ్గించవచ్చని అనుకున్నాడు. ఈ సేవలన్నింటిని కలిపి రోడ్ బేజ్ అనే సంస్థను ప్రారంభించాడు.


రూ.1500 లకే రెండు వందల కిలోమీటర్ల క్యాబ్ లో వెళ్లే అవకాశాన్ని కల్పించాడు దిల్‌ఖుష్ కుమార్. దీంతో ఏడాదిలోనే ఓలా, ఉబర్ వంటి సంస్థలను వెనక్కి నెట్టి బిహార్ లో అతిపెద్ద క్యాబ్ సంస్థగా రోడ్ బేజ్ అవతరించింది. పలు దేశీయ పెట్టుబడిదారులు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఆ సంస్థ విలువ రూ.10 కోట్లకు చేరింది. దీంతో దిల్ ఖుష్ కుమార్ బిహార్ స్టార్టప్ కింగ్ గా అవతరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com