మేషం : ప్రయాణాలు శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.
వృషభం : సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోమున సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మిధునం : ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలువదు. వృధా ఖర్చులు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం : ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
సింహం : సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలుంటాయి.
కన్య : నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమౌతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
తుల : మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.
వృశ్చికం : కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.
ధనస్సు : భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
మకరం : కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.
కుంభం : మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఋణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.
మీనం : సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.