స్టాక్ మార్కెట్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వారికి మంచి రాబడి వస్తుందని చెప్పొచ్చు. దీర్ఘకాలంలో కేవలం స్టాక్ ధర పెరగడంతో మాత్రమే కాదు ఇంకెన్నో కారణాలతో ఇన్వెస్టర్ లాభాలు పొందుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయా కంపెనీలు వాటి లాభాలను ఇన్వెస్టర్లకు వాటా రూపంలో ఇవ్వడమే కారణంగా చెప్పొచ్చు. దీంట్లో బోనస్ షేర్లు, డివిడెండ్, షేర్ల బైబ్యాక్, స్టాక్ స్ప్లిట్ ఇలా వేర్వేరు కారణాలతో అదనంగా ఎలాంటి పెట్టుబడి లేకుండానే మంచి రిటర్న్స్ వస్తుంటాయని చెప్పొచ్చు. అందుకే చాలా మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. ఇప్పుడు ఇలా ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన ఒక స్టాక్ గురించి చూద్దాం.
ఇదే మనీ మాస్టర్స్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్. దీనిని నమ్ముకున్నోళ్లకు బంపర్ రిటర్న్స్ అందించింది. 2013 జులైలో ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌గా (IPO) వచ్చింది. రూ. 15 ఫిక్స్‌డ్ ప్రైస్‌తో ఈ స్టాక్ BSE SME ఎక్స్చేంజిలోకి ప్రవేశించింది. 2013, ఆగస్ట్ 12న స్వల్ప లాభంతో రూ. 16.25 వద్ద లిస్టయింది. ఈ షేర్లు అలాట్ అయిన వారికి లిస్టింగ్ డే తో 8 శాతం మేర రిటర్న్స్ వచ్చాయి. అప్పుడే తీసేయకుండా ఇంకా అలాగే కొనసాగించిన వారికి అదిరిపోయే లాభాలు వచ్చాయి.
కారణం బోనస్ షేర్లు. 2017 సంవత్సరంలో ఈ కంపెనీ 1:4 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ప్రతి 4 షేర్లకు అదనంగా ఒక షేరు ఉచితంగా వచ్చింది. దీంతో వారి షేర్ల సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఐపీఓ కింద కనీసం 8 వేల షేర్లు కొనుగోలు చేయాల్సి ఉండగా.. పెట్టుబడి మొత్తం రూ. 1.20 లక్షలుగా ఉంది. ఇక బోనస్ షేర్లతో ఈ షేర్ల సంఖ్య 10 వేలుగా మారింది.
ఇక ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 148 గా ఉండగా.. ఆ 8 వేల షేర్ల లెక్కన వారి రూ. 1.20 లక్షలు పెట్టుబడి పెట్టిన వారి సంపద ఇప్పుడు రూ. 14.80 లక్షలుగా మారింది. దీంతో రూ. 13 లక్షలకుపైగా లాభమే వచ్చిందని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్‌లో ఈ స్టాక్ పెద్దగా లాభాలు అందించలేదు. గత 5 రోజుల్లో చూస్తే ఈ షేరు 3 శాతానికిపైగా పడిపోయింది. నెలలో 14 శాతం పతనమైంది. 6 నెలల్లో 100 శాతానికిపైగా లాభాలు ఇచ్చింది. ఏడాది వ్యవధిలో సుమారు 360 శాతం రాబడి ఇచ్చింది.