గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం వైభవంగా వెండి రథోత్సవం నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు శ్రీ స్వామి వారి ఉత్సవ మూర్తిని వెండి రథంపై అధిష్టించి విశేష పూజలు చేశారు. ఆలయ ఏఇఓ మల్లికార్జున హారతి ఇచ్చిన అనంతరం రథోత్సవం నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు రథోత్సవం తిలకించి పారవశ్యం పొందారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.