ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్లకు స్పెషల్ ఆఫర్.. 9 శాతం మేర వడ్డీ..ఎస్బీఐ సహా బ్యాంకుల ఫుల్ లిస్ట్ ఇదే!

business |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 09:07 PM

ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనువైన మార్గంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని సీనియర్ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్లు మరింత మెరుగైన ఆప్షన్ అని చెప్పవచ్చు. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు సైతం దాదాపు 0.50 శాతం మేర అదనపు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. రూ. 2 కోట్లలోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు పొందగల వడ్డీ రేట్లు ఇప్పుడు మనం ఓసారి పరిశీలిద్దాం. ఇందులో ఏడాది, మూడేళ్లు, 5 ఏళ్ల మెచ్యూరిటీ టర్మ్ గల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఉన్నాయి.


జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రస్తుతం ఏడాది డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వార్షిక వడ్డీ రేటు 9 శాతంగా ఉంది. అలాగే 3 ఏళ్లకు 7.75 శాతం, 5 ఏళ్లకు 7.75 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది.


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్లకు ఏడాది డిపాజిట్లపై గరిష్ఠంగా 8.70 శాతం వడ్డీ లభిస్తోంది. అలాగే 3 ఏళ్లకు 8.50 శాతం, 5 ఏళ్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తోంది.


బంధన్ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు ఏడాది టర్మ్ డిపాజిట్లపై 8.35 శాతం ఇస్తుండగా.. మూడేళ్లకు 7.75 శాతం, 5 ఏళ్లకు 6.60 శాతం ఇస్తోంది.


ఇండస్ ఇండ్ బ్యాంకులో సీనియర్లకు ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. అదే మూడేళ్ల డిపాజిట్లకు 7.75 శాతం, 5 ఏళ్ల డిపాజిట్లకు 7.75 శాతం వడ్డీ లభిస్తోంది.


క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్లకు గరిష్ఠంగా ఏడాది డిపాజిట్లపై 8 శాతం వడ్డీ ఇస్తోంది. మూడేళ్ల డిపాజిట్లపై 7.65 శాతం, 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్లకు 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.


యెస్ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 1 ఏడాది డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ ఇస్తుండగా 3 ఏళ్లు, 5 ఏళ్ల డిపాజిట్లకు 8 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.


ఎస్‌బీఎం బ్యాంకులో 60 ఏళ్లు పైబడిన వారికి 1 ఏడాది ఎఫ్‌డీకి 7.60 శాతం వడ్డీ ఇస్తుండగా.. 3ఏళ్లకు 8.10 శాతం, 5 ఏళ్లకు 8.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.


కోటక్ మహీంద్రా బ్యాంకులో సీనియర్లకు 1 ఏడాది డిపాజిట్లకు 7.60 శాతం వడ్డీ ఇస్తుండగా 3 ఏళ్లకు 7.60 శాతం, 5 ఏళ్లకు 6.70 శాతం వడ్డీ ఇస్తోంది.


సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఏడాది టర్మ్ డిపాజిట్లకు 7.35 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా మూడేళ్లకు మాత్రం ఏకంగా 9.10 శాతం వడ్డీ ఇస్తోంది. 5 ఏళ్లకు 8.75 శాతం ఆఫర్ చేస్తోంది.


బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్లకు 1 ఏడాదికి 7.30 శాతం, 3 ఏళ్లకు 7.25 శాతం, 5 ఏల్లకు 6.75 శాతం వడ్డీ అందిస్తోంది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడాదికి 7.30 శాతం, మూడేళ్లకు 7.25 శాతం, 5 ఏళ్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తోంది.


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్లకు 1 ఏడాది డిపాజిట్లకు 7.25 శాతం, 3 ఏళ్ల ఎఫ్‌డీలకు 7 శాతం, 5 ఏళ్ల డిపాజిట్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తోంది.


యూనియన్ బ్యాంకులో సీనియర్లకు ఒక ఏడాది టర్మ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ ఇస్తుండగా 3, 5 ఏళ్లకు 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.


పంజాబ్ నేషనల్ బ్యాంకులో సీనియర్లకు 1 ఏడాదికి 7.25 శాతం, మూడేళ్లకు 7.50 శాతం, 5 ఏళ్లకు 7 శాతం వడ్డీ అందిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com