రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన అతి పురాతన శివాలయంలో స్వయంభు జంబుకేశ్వరుడికి సోమవారం ప్రత్యేక పూజలు అందించిన పురోహితులు రామకృష్ణస్వామి. స్వామివారికి పంచామృత, రుద్ర కవచ అభిషేకాలు చేపట్టి స్వామి మూలవిరాట్ పై సుగంధి వేర్లతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామివారిని దర్శించడానికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.