ప్రపంచవ్యాప్తంగా టాటా కంపెనీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అధునాత ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చే ఈ కార్లను అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్ మార్పులతో పాటు ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు వినియోగదారుల మనస్సును దోచుకుంటుంది.అయితే టాటా కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ కారు అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ ఇప్పటివరకూ 20 లక్షల ఎస్‌యూవీలను అమ్మిందంటే టాటా కార్ల క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కార్లల్లో సియెర్రా, సఫారి వంటి పాత మోడల్‌లు, కొత్త మోడళ్లైన పంచ్, నెక్సాన్, హారియర్, న్యూ సఫారి వంటి కార్లు ఉన్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ టాటా హాయర్,, సఫారిపై నెలాఖరు వరకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. అలాగే ప్రముఖ మోడల్స్ అయిన నెక్సాన్, పంచ్ ఈవీలపై కూడా ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో
టాటా నెక్సాన్ ఈవీ
టాటా నెక్సాన్ టాటా కంపెనీకు సంబంధించిన ఒక ప్రసిద్ధ మోడల్. ఈ మోడల్ నెలవారీగా అమ్ముడవుతున్న టాప్ 10 వాహనాల్లో స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నెక్సాన్ అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా మే 2024లో నెక్సాన్ టాప్ 10 జాబితాలో కూడా చేరలేకపోయింది. జూన్‌లో నెక్సాన్ కేవలం వైఓవై క్షీణతను చూసేటప్పుడు జాబితాలో చేరలేదు. దీంతో ఈ మోడల్‌పై కంపెనీ ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. నెక్సాన్ ఎంపవర్డ్+ ఎల్ఆర్, ఎంపవర్డ్ ప్లస్ ఎల్ఆర్ డార్క్ వేరియంట్‌లపై రూ. 1.3 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఈ మోడల్‌లోని ఇతర వేరియంట్‌లు రూ. 50,000 నుంచి రూ. 70,000 మధ్య తగ్గింపును అందిస్తుంది.
టాటా పంచ్ ఈవీ
టాటా పంచ్ ఈవీ పరిమాణం, ఫీచర్లు, ధర, ముఖ్యంగా దాని పవర్‌ట్రైన్ ఎంపికల కారణంగా యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే టాటా పంచ్ సాధారణ, ఈవీ వేరియంట్‌లను టాటా మోటార్స్ జూన్ 2024లో 18,238 యూనిట్లను విక్రయించింది. అంటే దాదాపు ఈ మోడల్ 66 శాతం వైవైవై వృద్ధిని సాధించింది. దీంతో అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ టాటా పంచ్ ఈవీపై రూ. 10,000 నుంచి రూ. 30,000 మధ్య తగ్గింపులను అందిస్తుంది. టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 10.98 లక్షల నుంచి మొదలవుతాయి. అలాగే ఈ కారు మొత్తం 20 వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.