ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు సీనియర్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను చంపేసి కాలువలో పడేసారు.ముచ్చుమర్రి ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న బాలిక మైదానంలో ఆడుకుంటుండగా.. మేం కూడా ఆడతాం అంటూ ఆమెతో చేరారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి ఎవ్వరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. ఆ తర్వాత బాలిక ఎక్కడ తల్లిదండ్రులకు చెప్తుందో అని చంపేసి దగ్గర్లోని కాలువలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్నిఫర్ డాగ్స్ సాయం ద్వారాపోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే బాలిక శవం మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ కరువు!
నంద్యాలలో 9 ఏళ్ల చిన్నారి పై పాశవికంగా అత్యాచారం చేసి....... క్రూరంగా చంపేసిన ముగ్గురు యువకులు.
శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.#CBNFailedCM #SaveApFromTdp pic.twitter.com/21alSXGBs0
— Nani YCP (@RajNani111) July 10, 2024