కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో తీసుకొన్న ఓ నిర్ణయంతో మొబైల్ ప్రియులకు ఎంతో కలిసొస్తోంది. ఐఫోన్ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త. ఐఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇప్పుడు భారాగీ డబ్బులు ఆదా కానున్నాయి. ఎందుకంటే ఐఫోన్ల ధరలను తగ్గించినట్లు తయారీ సంస్థ యాపిల్ ప్రకటించింది. భారత్‌లో ఐఫోన్ ధరలు రూ.300 నుంచి రూ.6 వేల వరకు తగ్గించినట్లు ఆ సంస్థ తెలిపింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2024-25లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అధిక ధరలు గల ఫోన్లపై ఇంపోర్ట్ డ్యూటీని కేంద్రం 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఫోన్ల ధరలను తగ్గించేందుకు ప్రధాన కారణంగా దిగుమతి సుంకాన్ని తగ్గించడమేనని యాపిల్ సంస్థ తెలిపింది.
యాపిల్ ప్రకటించిన కొత్త ధరల ప్రకారం.. మన దేశానికి దిగుమతి అవుతున్న ఐఫోన్ ప్రో మోడళ్ల రేట్లు రూ. 5100 నుంచి రూ.6 వేల వరకు దిగివచ్చాయి. ఇప్పటి వరకు యాపి ఐఫోన్ 15 ప్రో ధర రూ. లక్షా 34 వేల 900గా ఉంది. అలాగే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. లక్షా 59 వేల 900 గా ఉంది. అయితే, ధరల తగ్గింపు తర్వాత.. ఐఫోన్ 15 ప్రో మోడల్ 128 జీబీ వెర్షన్ ధర రూ. 1 లక్షా 29 వేల 800 లకే లభిస్తోంది. అంటే రూ. 5100 వరకు తగ్గింది. ఇంతకు ముందు ధరతో పోలిస్తే ప్రస్తుత ధర 3.7 శాతం మేర దిగివచ్చింది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 128 జీబీ వెర్షన్ ఫోన్ల ధర రూ. 1,59,900 నుంచి రూ. 1,54,900 లకు పడిపోయింది. అంటే దాదాపు 10 శాతం మేర తగ్గింది.
ఇక భారత్‌లో తయారైన ఐఫోన్ 13, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ధరలు రూ.300 వరకు తగ్గినట్లు యాపిల్ సంస్థ తెలిపింది. ఐఓఫన్ ఎస్ఈ రేటు రూ.2300 మేర తగ్గించినట్లు తెలిపింది. బేసిక్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ రేటు రూ. 49,900 నుంచి రూ. 47 వేల 600లకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో లగ్జరీ ఫోన్ల ధరలను దిగవచ్చినట్లయింది. మన దేశంలో ఐఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కువ మంది ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అధిక ధరలు ఉన్నప్పటికీ హుందాతనం కోసం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రూ.6 వేల వరకు ధరలు దిగిరావడం గమనార్హం.