వెల్లుల్లి.. ప్రతి వంటగదిలో ఉంటుంది. వెల్లుల్లిలో ఔషధ గుణాలతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.. అందుకే చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లిని పచ్చిగా తింటారు. వెల్లుల్లి బరువు తగ్గడానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుందని, బెల్లీ ఫ్యాట్ సమస్యను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు.వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.. అందుకే ఉదయాన్నే వెల్లుల్లిపాయలు తిన్నా.. లేదా దాని రసం కొంచెం తాగినా ఆరోగ్యంగా ఉంటారు.బరువు తగ్గడానికి వెల్లుల్లిలోని కొన్ని లక్షణాలు చెడు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే గార్లిక్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది.