ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మెద్దంటూ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు వచ్చే ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన ఆగస్టు 3నే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.