గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ విజయ్ కుమార్ శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షణం అనంతరం అర్చకులు వారి గోత్ర నామాలతో స్వామికి పూజ చేసి స్వామి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.