కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి, వెండి ధర భారీగా పెరుగుతోంది.శనివారం (03 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ. 180లు పెరిగింది. అంటే నేడు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,700లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 150లు పెరిగి, రూ. 64,660లుగా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 100లు పెరిగి రూ.87,200లుగా నమోదైంది.