గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిన రద్దు చేశారని చంద్రబాబు అన్నారు.అయితే త్వరలోనే రేషన్ దుకాణాల్లో గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అందించే అన్ని సరుకుల పంపిణీని పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం పౌరసరఫరాలశాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో కందిపప్పు ధర రూ.180 ఉంటే.. ప్రత్యేక కౌంటర్లలో రూ.150కు, బియ్యం కూడా కేజీ రూ.48కు విక్రయిస్తున్నట్లు తెలిపారు.రేషన్ దుకాణాల్లో మరిన్ని సరకులు తక్కువ ధరకు అమ్మాలని, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పని చేస్తేనే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు.