అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు ప్రపంచంలోని అగ్ర దేశాలను సైతం ఆర్ధిక మాంద్యంలోకి నెడతాయేమో అన్న భయం పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రోజు (సోమవారం) గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు భారీగా క్షిణించాయి. దీనిపై దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రాచీన భారతీయ అభ్యాసం ప్రాణాయమాన్ని అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నటికీ రాదు. గట్టిగా శ్వాసతీసుకుని లోతుగా చూడండి. మీడియం నుంచి లాంగ్ టర్మ్ వరకు ఎవరి దుగుదలకు ఆటంకం కలగదు. లాంగ్ గేమ్ ఆడండి అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆర్ధిక మాంద్యం భయాల మధ్య మార్కెట్ సోమవారం సెన్సెక్స్ 3 శాతం క్షీణించగా, నిఫ్టీ కూడా విస్తృత అమ్మకాలతో దాదాపుగా పతనమైంది. స్టాక్ మార్కెట్ క్రాష్ బీఎస్ఈలో జాబితాని సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో దాదాపు రూ. 457 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 442 లక్షల కోట్లకు తుడిచిపెట్టుకుపోయింది. ఈ రోజు సెషన్‌లో పెట్టుబడిదారులు దాదాపు రూ. 15 లక్షల కోట్లను కోల్పోయారు, అయితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో కూడా తిరోగమనం ఉంది. జపాన్ బెంచ్‌మార్క్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ దాదాపు 13 శాతం క్షీణించడంతో ఆసియా మార్కెట్లు పడిపోయాయి.