క్యాబేజీ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనువైనవి. 2 నుండి 3 సార్లు నేల వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల పోటాష్, 40 కిలోల బాస్వరం వేసుకొని చివరి దుక్కిని కలియ దున్నుకోవాలి. ఒక్క ఎకరానికి దేశవాళి రకం విత్తనాలు అయితే 300 గ్రాముల విత్తనాలు, సంకర రకం విత్తనాలు అయితే 100-150 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి. ట్రేలలో విత్తుకోవడం వల్ల నారును ఆకూ తినే పురుగు ఆశించకుండా ఉంటుంది.