ఫోన్‌ను జాగ్రత్తగా వాడితే ఎక్కువ కాలం మన్నుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే స్మార్ట్ ఫోన్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. డైరెక్ట్‌గా ఈ విషయాన్ని ఏ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ చెప్పదు. ఫోన్ బాక్స్‌పై ఉండే OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ ముగిసే తేదీనే ఎక్స్‌పైరీ డేట్‌గా భావించవచ్చు. యాపిల్, సామ్‌సంగ్ వంటి కంపెనీలు 7 ఏళ్ల వరకు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తాయి. అప్‌డేట్స్ ఆగితే ఫోన్లలో యాప్స్ పని చేయవు.