భారతదేశపు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో తన 'ట్రూ 5G అన్‌లిమిటెడ్ ప్లాన్' కేటలాగ్‌లో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ Jio నుండి చౌకైన అపరిమిత డేటాను అందిస్తోంది. ఈ రీఛార్జ్ అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ అత్యంత సరసమైన అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్ 14 రోజుల వాలిడిటీతో వస్తుంది. మీరు జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్ అయితే లేదా మీ కనెక్షన్‌ను పోర్ట్ చేయాలని లేదా కొత్త జియో సిమ్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే జియో కొత్త రూ.198 ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జియో రూ.198 అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ Jio ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 14 రోజుల పాటు రోజుకు 2GB డేటాతో వస్తుంది.ప్లాన్‌ని యాక్టివేట్ చేయడానికి వినియోగదారులు MyJio లేదా మరేదైనా ప్లాట్‌ఫామ్ ద్వారా వారి Jio ప్రీపెయిడ్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే మీరు రూ. 349 ప్లాన్‌ను కూడా చెక్ చేయవచ్చు. ఇది 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. మీ అవసరాలకు అనుగుణంగా మీరు వెబ్‌సైట్‌లో ఇతర అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లను కూడా తనిఖీ చేయవచ్చు. మీరు కొత్త కనెక్షన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు Airtel, Vi ప్లాన్‌లను కూడా కంపార్ చేయవచ్చు. ఇటీవలే జియో తన టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఆ తర్వాత Vi, Airtel తమ రీఛార్జ్ ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచనున్నాయ.