చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు. దీనికి గల కారణం కూడా తెలిపారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట.
ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందని, అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa