సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల దివ్యక్షేత్రంలో సాయంత్రం 6.30కి మొదలైన గరుడ వాహనసేవ అర్ధరాత్రి వరకూ కొనసాగింది. భక్తజన బృందాలు భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.