కడప జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన చెరుకూరి శ్రీధర్ ను గురువారం రాయలసీమ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మల్లేల జగదీష్ కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ఏపీ సోషల్ వెల్ఫేర్, కేజీబీవిల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. రెండు రోజుల క్రితం కొండాపురం రెసిడెన్షియల్ పాఠశాలలో ఇద్దరి విద్యార్థినులు పాము కాటుకు గురైన ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.