కడప నగరపాలక సర్వసభ్య సమావేశాన్ని మేయర్ సురేష్ బాబు రద్దు చేశారు. గురువారం నగరపాలక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని సర్వసభ్య సమావేశంలో మేయర్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పోడియం పక్కన ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో కుర్చీలు వేయకపోవడానికి ఎమ్మెల్యే ప్రస్తావించారు. మేయర్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన వాగ్వివాదంతో మేయర్ సురేష్ బాబు ఉన్నపలంగా సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారు.