ఆకుకూరల్లో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఇస్తాయి. అత్యంత పోషకాలు ఉన్న ఆకు కూరలలో తోటకూర ఒకటి. అయితే ఈ తోటకూరలో ప్రధానంగా ఆకుపచ్చ, ఎరుపు తోటకూర అనే రెండు రకాలు ఉన్నాయి. తోటకూరతో తాజా ఎర్ర తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఎర్ర తోటకూర తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
* ఎర్ర తోటకూరలో విటమిన్-ఏ, సి, ఈ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్ఫరస్, ప్రొటీన్, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వారంలో కనీసం రెండు సార్లు ఈ ఆకుకూరను తింటే హెల్త్‌కి మంచిది.
* రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచడంలో ఎర్ర తోటకూర బాగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు ఆహారంలో ఎర్ర తోటకూర తింటే మంచిది. ఎర్ర తోటకూర జీర్ణ సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి.
* ఆరోగ్యానికి ఎర్ర తోటకూర చాలా మంచిది. కంటి చూపు,చర్మ ఆరోగ్యాన్ని, కంటి చూపు, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎర్ర తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి.. చర్మంపై ముడతలు, మొటిమలను పొగొట్టి ముఖాన్ని అందంగా కాంతివంతంగా ఉండేలా ఎర్ర కూర చేస్తుంది.
* మన అనేక సమస్యలు, వ్యాధుల నుంచి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎర్ర తోటకూర బెస్ట్ ఆహారం. ఎర్ర తోటకూర విటమిన్-సి, రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.