2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాలను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. విధ్వంసంతోనే వైసీపీ పాలన నడించిందని అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. గత ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలను అమలు చేసిందని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు అపురూపమైన తీర్పు ఇచ్చారన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి దశ నడిచిందంటూ మంత్రి కామెంట్స్ చేశారు.