ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డి.రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. కె.కన్నబాబుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా బి.అనిల్ కుమార్ రెడ్డిని నియమించింది.
గంధం చంద్రుడును కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. డి.హరితను వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో ఆర్టీ నంబర్ 1935ను జారీ చేశారు.