మంగళగిరి ఎయిమ్స్ వైద్య అధికారులు కోరిన విధంగా నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామని విద్యుత్ అధికారి సురేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.
ఈ ప్రయోగంలో 'ఆటోమేషన్ రింగ్ మెయిన్ యూనిట్' వ్యవస్థను ఉపయోగించామన్నారు. ఇక పై తాడేపల్లి లోని విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి 2 మార్గాలలో విద్యుత్ సరఫరా కొనసాగడంతో మంగళగిరి ఏయిమ్స్ కు నిరంతర విద్యుత్ ఉంటుందన్నారు.