సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. అందుకే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల కోసం ఏకంగా ప్రత్యేక పేజీలను సైతం క్రియేట్ చేస్తున్నారు.నెటిజన్లు కూడా వీటికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు రకరకాలుగా ఉంటాయి.వీటిలో కొన్ని మన కంటి చూపును పరీక్షించేవి అయితే మరికొన్ని ఆలోచన శక్తిని టెస్ట్ చేసేవి ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో భలే కిక్కు ఉంటుందని తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. వీటినే బ్రెయిన్ టీజర్‌గా చెబుతుంటారు. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే అంకెలు కనిపిస్తున్నాయి కదూ. 1 నుంచి 15 అంకెలు ఉన్న ఈ ఫొటోలో ఓ తప్పు దాగి ఉంది. సదరు తప్పును కనిపెట్టడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మీరు ఈ తప్పును కనిపెట్టారా.?
ఈ ఫొటోలో ఉంది సింపుల్ తప్పే కానీ.. కనిపెట్టడం మాత్రం అంత సులభమైన విషయం కాదండోయ్. ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనించండి. ఇట్టే పజిల్‌ను సాల్వ్ చేయొచ్చు. అయితే పది సెకండ్లలో మీరు ఆ తప్పును గుర్తించగలిగితే మీ కంటి చూపును సూపర్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఆ మిస్టేక్ ఏంటో కనిపెట్టారా.? అయితే ఓసారి ఫొటోలో మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడైనా తప్పును కనిపెట్టారా, లేదా.? అయితే ఒకసారి ఈ ఫొటోలో ఉన్న 13 నెంబర్‌ని పరిశీలించండి. అందులో 1 నెంబర్‌కి బదులుగా ఇంగ్లిష్ లెటర్ I ఉంది. ఇదే ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్.