ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొటీన్ లోపం లక్షణాలు, ప్రొటీన్ పొందే మార్గాలు ఇవే..!

Life style |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 01:20 PM

ఆహారం ద్వారానే శరీరానికి పూరిస్థాయిలో ప్రోటీన్ అందాలి. అయితే, తగినంత ప్రోటీన్ లేకపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. “రోజులో కావాల్సిన ప్రోటీన్ తీసుకోకపోతే అది లోపంగా మారుతుంది. కొన్ని లక్షణాలు ద్వారా ప్రోటీన్ లోపాన్ని గుర్తించవచ్చు. అలసటగా ఉండడం ప్రధానమైన లక్షణం. పాదాల్లో వణుకు, జుట్టు రాలడం, గోళ్లు పెళుసుగా మారడం, చర్మ సమస్యలు, దంతాల్లో ఇబ్బంది, హర్మోన్ల వల్ల మూడ్ మారుతుండడం, పీరియడ్స్ క్రమంతప్పడం, ఆహారం ఆలస్యంగా జీర్ణమవడం, కండరాలు, కాళ్ల నొప్పులు, స్థిరంగా నడవలేకపోవడం ఇతర లక్షణాలుగా ఉన్నాయి” అని ఉమాశక్తి వెల్లడించారు. రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే కూడా ప్రోటీన్ చాలా ముఖ్యమని ఉమాశక్తి వెల్లడించారు. శరీరంలో యాంటీబాడీలు పెరిగేందుకు ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని, ఇది తక్కువగా ఉంటే సమస్యలు ఎదురవుతాయని చెప్పారు.
ప్రోటీన్ పొందేందుకు మార్గాలు ఇవే..
ప్రోటీన్ లోపం సమస్య పరిష్కరించుకునే మార్గం చెప్పారు. ప్రతీ రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండే వాటిని తప్పకుండా యాడ్ చేసుకోవాలని చెప్పారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏవంటే.. బాదం, వాల్‍నట్స్, పిస్తాలు లాంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్, గుమ్మడి గింజలు, ఫ్లాక్ సీడ్స్ సహా పప్పు ధాన్యాలు, కాయధాన్యాల్లో ప్రోటీన్ మెండుగా దక్కుతుంది. టోఫు ద్వారా కూడా ప్రోటీన్ బాగా అందుతుంది. పాలు, పన్నీర్, పెరుగు, యగర్ట్ సహా పాలఉత్పత్తుల్లో ప్రోటీన్ మెండుగా ఉంటుంది. వీటిని మీ డైట్‍లో రెగ్యులర్‌గా తీసుకోవాలి. నాన్‍వెజ్ తింటే, చేపలు, చికెన్, కోడిగుడ్లలో ప్రోటీన్ మెండుగా ఉంటుంది. మటన్‍లోనూ ప్రోటీన్ ఉన్నా కాస్త తక్కువే తీసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com