ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతున్నారా?.. చాలా ప్రమాదకరం..!

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 01:00 PM

కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతున్నారా?.. అయితే మీరు జాగ్ర‌త్త గా ఉండాలి. అవును, ఎందుకంటే ఇలా కూల్ డ్రింక్స్‌ను త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల ఎముక‌ల సాంద్ర‌త త‌గ్గిపోతుంద‌ని, ఎముక‌లు బ‌ల‌హీనంగా మారి విరిగిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. కూల్ డ్రింక్స్ మ‌న‌కు అనేక విధాలుగా హాని చేస్తాయ‌ని, ముఖ్యంగా వీటి వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయ‌ని సైంటిస్టులు అంటున్నారు.
నేష‌న‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ మెడిసిన్‌కు చెంఎదిన ప‌రిశోధ‌కులు 7 ఏళ్ల పాటు అధ్య‌య‌నం చేసి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. త‌ర‌చూ కూల్ డ్రింక్స్ తాగేవారి ఎముక‌లు త్వ‌ర‌గా విరిగిపోయే అవ‌కాశాలు ఉంటాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే ది అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ క్లినిక‌ల్ న్యూట్రిష‌న్‌లోనూ ఈ వివ‌రాల‌ను ప్ర‌చురించారు. అయితే ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల్లో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని వారు అంటున్నారు. క‌నుక మ‌హిళ‌లు అస‌లు కూల్ డ్రింక్స్‌ను తాగ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని వారు సూచిస్తున్నారు.
కూల్ డ్రింక్స్‌లో రెండు స‌మ్మేళ‌నాల శాతం ఎక్కువ‌గా ఉంటుంది. కెఫీన్‌, ఫాస్ఫారిక్ యాసిడ్‌లు కూల్ డ్రింక్స్‌లో ఎక్కువ‌గా ఉంటాయి. కెఫీన్ వ‌ల్ల మ‌న శ‌రీరం క్యాల్షియంను శోషించుకునే సామ‌ర్థ్యాన్ని కోల్పోతుంది. ఇక ఫాస్ఫారిక్ యాసిడ్ వ‌ల్ల ర‌క్తంలో ఉండే క్యాల్షియం మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది. ఇలా ఈ రెండు స‌మ్మేళ‌నాలు చేటు చేస్తాయి. ఇవి రెండూ కూల్ డ్రింక్స్‌లో ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక కూల్ డ్రింక్స్‌ను తాగితే శ‌రీరానికి అస‌లు క్యాల్షియం ల‌భించ‌దు. ఫ‌లితంగా ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి. ఎముక‌లు విరిగిపోయే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు అంటున్నారు.
మెనోపాజ్ అనంత‌రం మ‌హిళ‌లల్లో క్యాల్షియం శోషించుకునే రేటు క్ర‌మంగా త‌గ్గిపోతుంది. అలాంట‌ప్పుడు కూల్ డ్రింక్స్ తాగితే శ‌రీరానికి క్యాల్షియం అస‌లు ఏమాత్రం ల‌భించ‌దు. దీంతో మ‌హిళ‌ల్లో ఎముక‌లు విరిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే టీనేజ్ లో ఉన్న‌వారికి ఎముక‌ల నిర్మాణం కోసం క్యాల్షియం అవ‌స‌రం. కానీ కూల్ డ్రింక్స్‌ను అధికంగా తాగితే క్యాల్షియం ల‌భించ‌దు. దీంతో వారిలో నిర్మాణం ఆగిపోతుంది. దీంతోపాటు ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. క‌నుక మ‌హిళ‌లు, యువ‌త‌, టీనేజ్‌లో ఉన్న‌వారు కూల్ డ్రింక్స్‌ను తాగే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వాటిని అస‌లు తాగ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.
ఇక కూల్ డ్రింక్స్‌లో చ‌క్కెర కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల కూల్ డ్రింక్స్‌ను తాగితే శ‌రీరంలో ఇన్సులిన్ లెవ‌ల్స్ అమాంతం పెరుగుతాయి. ఫ‌లితంగా ఎక్కువ‌గా మూత్ర విస‌ర్జ‌న చేయాల్సి వ‌స్తుంది. ఈ మూత్రంతోపాటు క్యాల్షియం కూడా బ‌య‌ట‌కు పోతుంది. దీంతో శ‌రీరానికి క్యాల్షియం ల‌భించ‌క ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. క‌నుక ఎలా చూసినా కూడా కూల్ డ్రింక్స్ వ‌ల్ల మ‌న‌కు న‌ష్ట‌మే త‌ప్ప అస‌లు ఏమాత్రం లాభం ఉండ‌దు. కాబ‌ట్టి కూల్ డ్రింక్స్‌ను త‌ర‌చూ తాగుతున్న‌వారు ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డాల్సిందేన‌ని డాక్ట‌ర్లు సైతం సూచిస్తున్నారు.
క్యాల్షియం త‌క్కువ‌గా ఉన్న‌వారు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు క్యాల్షియం ట్యాబ్లెట్ల‌ను వాడ‌వ‌చ్చు. అలాగే పాలు, గుడ్లు, జీడిప‌ప్పు, బాదం వంటి ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా క్యాల్షియం ల‌భిస్తుంది. వారంలో రెండు సార్లు నువ్వుల‌తో చేసిన చిక్కిల‌ను తినాలి. దీంతో కూడా క్యాల్షియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com