గ్రామీణ ప్రాంతంలో పేదల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే పథకం ఎన్‌ఆర్ఈజీఎస్ అని తెలుగుదేశం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. 70 నుంచి 80శాతం జాబ్ కార్డులు ఉన్నవారికి 100 దినాలు పనిని కల్పించాలని చెప్పారు. 10శాతం దాటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 రోజులు పని లభించలేదన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. చివరకు ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్లను కూడా మూసివేశారని మండిపడ్డారు. అరటికి, కొబ్బరి, కొకొ, వక్కకు ఇస్తే పనిదినాలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. గుర్రపుడెక్క తీసుకున్నే అవకాశం ఇస్తే పనిదినాలు పెరుగుతాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొ్న్నారు.