కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో కాల భైరవ జయంతి(మహ కాల అష్టమి) ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రక్క జిల్లాల నుండి భక్తులు దర్శనానికి బారులు తీరారు.
కాల భైరవ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కావడంతో భక్తులు మినప గారెలు దండ, స్వీట్,పులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి హారతు లు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం కాళీ కాల భైరవ హోమం నిర్వహించారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు దేవార వినోద్, ఆలయ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్ భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.