ఒకప్పుడు టీమిండియాలో కొత్త బంతి బౌలర్ గా కొనసాగిన భువనేశ్వర్ కుమార్ కాలక్రమంలో వెనుకబడ్డాడు. అయితే, ఇవాళ ఐపీఎల్ వేలం రెండో రోజున అతడికి భారీ ధర లభించింది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో దిట్ట అయిన భువనేశ్వర్ కుమార్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ ప్రభావం ఏమంత లేదనే చెప్పాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన సమయంలో కొన్ని సీజన్ల పాటు రాణించిన ఈ రైట్ ఆర్మ్ పేసర్... క్రమంగా ప్రాభవం కోల్పోయాడు. అయినప్పటికీ, అతడిని ఆర్సీబీ పది కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి సొంతం చేసుకోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఆర్సీబీ ఫ్రాంచైజీ... భువీ ఎక్స్ పీరియన్స్ ను చూసి కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.