కొత్తూరు మండలంలోని నివగాం గ్రామానికి చెందిన వాడ సాయి (28) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మినీ వ్యాను డ్రైవర్గా పని చేస్తున్న సాయికి ఒడిశా ప్రాంతానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమెను తీసుకెళ్లిన బంధువులను జీర్ణించుకోలేని సాయి, తీవ్ర మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆలీ తెలిపారు.