మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ( కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మహారాష్ట్రలోని 14వ అసెంబ్లీ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు తదుపరి సీఎంపై స్పష్టత వచ్చేంతవరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా శిందే వ్యవహరించనున్నారు.మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను 234 స్థానాలతో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) 48 సీట్లకే పరిమితమైంది. ఈనేపథ్యంలో భాజపా (BJP) నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం అంటుండగా.. ఏక్‌నాథ్ శిందేనే కొనసాగించాలని శివసేన పట్టుబడుతుంది. దీంతో సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది.