అమలాపురంలో సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఇవాళ(శుక్రవారం) కాపునాడు నాయకులు ఫిర్యాదు చేశారు. కాపులను కించపరిచే విధంగా మాట్లాడాడంటూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ X లో "కాపు" కులంపై చేసిన వాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న తరుణంలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై కాపునాడు నేతలు ఫిర్యాదు చేశారు.